నల్ల పోచమ్మ ఆలయం

బేగుంపేట్ ఫ్లై ఓవర్ వద్ద నున్న నల్ల పోచమ్మ ఆలయం కమిటి వారు లోక్ సత్తా జాతీయ అద్యక్షులు జయ ప్రకాష్ నారాయణ్ ను కలసి, 91 సంవత్సరాలుగా స్థానికులు ఈ ఆలయం లో పూజలు చేసుకుంటున్నారు అని, గత కొన్నాళ్లుగా ఈ ప్రాంతం బేగుంపేట్ పబ్లిక్ స్కూల్ వారిది అని వారు అబ్యంతరాలు పెడుతున్నారు అని అయన దృష్టి కి తీసుకొని వచ్చారు. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ పూజలు నిర్వహించడం ఆనవాయితి అని , దేవాదాయ శాఖ వారు గుడి ని గుర్తించారని వారు ఆయనకు వివరించారు. దాతలు ఇచ్చిన 25,000 రూపాయిల విలువైన వాటర్ టాంకర్ ను పోలీసులు తీసుకొని వెళ్ళారని, ఇది ఏమని అడిగితే స్థానిక MLA తో మాట్లాడుకోమని సమాధానం ఇస్తున్నారని స్థానికులు ఆయనకు చెప్పారు. ఈ కార్యక్రమం లో లోక్ సత్తా సనత్ నగర్ నియోజక వర్గం అబ్యర్ది హైమా ప్రవీణ్, లోక్నా సత్తా నాయకులు లావణ్య, విమల దేవి, రాజీవ్, ఆలయ కమిటీ నుండి ధర్మకర్త సత్యనారాయణ,కుమార్ పాల్గొన్నారు. ఈ సమస్య ను తపక్క పరిష్కరిస్తామని JP గారు అన్నారు.

Author: adminn

Share This Post On